![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -726 లో... కావ్య ఫోటో పెట్టానని రుద్రాణి అనుకుంటుంది కానీ రాజ్ చూసేసరికి అక్కడ స్వప్న ఫోటో ఉంటుంది. ఇలా ఎందుకు మీ కోడలు ఫోటో పెట్టారని రుద్రాణిపై కోప్పడతాడు రాజ్. స్వప్న ఫోటో ఉండడం ఏంటని రుద్రాణి ఆలోచనలో పడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నా ఫోటో అలా పెట్టడానికి మీకు సిగ్గు లేదా అని స్వప్న కోప్పడుతుంది.
రాజ్ కిందకి రాగానే కావ్యని ఇంప్రెస్ చెయ్యడానికి ఏం చేసావని ఇందిరాదేవి, అపర్ణ అడుగుతారు. చీర బొకె తీసుకొని వచ్చానని రాజ్ తీసుకొని వస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యాలంటే ఇవి తీసుకొని వస్తారా అని ఇందిరాదేవి నిరాశగా మాట్లాడుతుంది. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేనొకటి తీసుకొని వచ్చానని డ్రెస్ తీసుకొని వస్తుంది. బ్లాక్ డ్రెస్.. ఇది కావ్యకి ఇవ్వమని పంపిస్తుంది. రాజ్ డ్రెస్ ఇచ్చినట్లు కావ్య ఇంప్రెస్ అయినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత రాజ్ డిస్సపాయింట్ గా వచ్చి కావ్య ఆ డ్రెస్ బాలేదని తిట్టిన విషయం చెప్తాడు.
మరొకవైపు రుద్రాణికి యామిని ఫోన్ చేసి ప్లాన్ ఏమైందని అడుగగా.. ఫెయిల్ అయిందని రుద్రాణి చెప్తుంది. దాంతో యామినికి మరింత కోపం వస్తుంది. ఇద్దరు కలిసి మళ్ళీ ఒక ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో రుద్రాణి ప్లాన్ లో భాగంగా జనాభా లెక్కలు అంటూ ఒక మనిషిని ఇంటికి పంపిస్తుంది. అతను అందరి వివరాలు కనుక్కుంటాడు. ఈవిడ మీకు ఏమవుతుందని ఇంట్లోవాళ్ళని కావ్య గురించి అడుగుతాడు. అక్కడ రాజ్ ఉండడంతో కావ్య సమాధానం చెప్పలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |